
పదోన్నతి ప్రతి ఉద్యోగి హక్కు అని,ఖాళీలను గుర్తించి అర్హత గల వారికి పదోన్నతులు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం కోరింది. ఈ మేరకు టీజీఓ అధ్యక్ష్యుడు ఏలూరి శ్రీనివాసరావుకు నేతృత్వంలో ఉద్యోగుల బృందం శాంతికుమారితో భేటీ అయ్యి ,వినతిపత్రం సమర్పించింది,
TGO DEMANDS FOR PENDING PROMOTIONS AND TRANSFERS
ప్రజాపాలన లక్ష్యాలను ప్రజలకు చేరవేయడంలో ,ఫలితాలను సాధించడంలో ,విజయోత్సవాల నిర్వహణలో ఉద్యోగులు నిబద్ధతతో పాల్గొన్నక్టు అని గుర్తు చేశారు .ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వారి దృష్టికి తీసుకువచ్చారు.
పదోన్నతుల ప్యానల్ సంవత్సరాన్ని సెప్టెంబర్ నుండి మరుసటి ఏడాది ఆగస్టు వరకు నిర్వహిస్తారని,పలు శాఖలు సీనియార్టీ జాబితాలు తయారు,ఖాళీలను గుర్తించడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని తెలిపారు .పరిపాలన సౌలభ్యం వేగవంతం కోసం ప్రభుత్వం పదోన్నతులను ప్రతి ప్యానల్ సంవత్సరాన్ని నిర్వహించి పూర్తి చేయాలని కోరారు .
లోకసభ ఎన్నికల ముందు ఉద్యోగుల అంగీకారం ,కౌన్సెలింగ్ లేకుండా యం పి డి ఓ లను సుదూర ప్రాంతాలకు బదిలీ చేశారని ,మళ్లీ వారిని పూర్వ స్థలాలకు తిరిగి బదిలీ చేయాలని కోరారు .తీవ్రమైన పని భారం ,గ్రూప్ 1 కేడర్ లో నియమితులై గత 18 సంవత్సరాలుగా ఏలాంటి పదోన్నతి లేకుండా ఉంటున్నారని ,వీరికి స్పష్టమైన జాబ్ చార్ట్ మరియు పదోన్నతుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు
.
జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు చేసి అన్ని ప్రధాన ఉద్యోగ సంఘాలకు గుర్తింపు ఇవ్వాలని,దీని వలన ఉద్యోగుల మౌలిక సమస్యల పరిష్కారానికి ఒక వేదిక అవుతుందని సూచించారు .సి పి యస్ రద్దు ,ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు విధానం అమలు ,కారుణ్య నియామకాలు చేపట్టడం వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ,తద్వారా ఉద్యోగ కుటుంబాలు మానసిక శారీరక ఆరోగ్య సంతోషాలకు మూలం అవ్వాలని విజ్ఞప్తి చేశారు .ఉద్యోగులు ద్విగుణీకృత ఉత్సాహంతో ప్రజా పాలన వారధులుగా పని చేస్తారని తెలిపారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలసిన వారిలో టి జి ఓ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ ,టి జి ఓ రాష్ట్ర నేతలు శ్రీనివాస మూర్తి ,ఆస్నాల శ్రీనివాస్ ,రంగారెడ్డి అధ్యక్షుడు డాక్టర్ రామారావు ,సిద్దిపేట అధ్యక్ష్యుడు డాక్టర్ శ్రీరామ్ రెడ్డిలతో పాటు పలు ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు.


